విజయసాయికి లాప్‌టాప్ ఇస్తే కేసు తారుమారు!:సిబిఐ

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి లాప్ టాప్ వినియోగించుకునే అవకాశమిస్తే కేసు తారుమారయ్యే అవకాశముందని సిబిఐ తరఫు న్యాయవాది శుక్రవారం కోర్టులో వాదించారు. లాప్ టాప్ లేదా కంప్యూటర్ ఇస్తే విజయ సాయి రెడ్డి ఇంటర్నెట్ ఉపయోగించుకోనే ఆస్కారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కంప్యూటర్ లేదా లాప్ టాప్ సౌకర్యం కల్పించవద్దని కోర్టును కోరారు. కంప్యూటర్‌తో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చునని తెలిపారు. సత్యం కేసులో రామలింగ రాజుకు చార్జీషీట్ తర్వాతే లాప్ టాప్ ఉపయోగించుకునే అవకాశం వచ్చిందని తెలిపింది. లాప్ టాప్ ద్వారా సాక్షులను ప్రభావితం చేసే ఆస్కారం ఉందన్నారు. తెల్ల కాగితాలు, పెన్ను ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అవసరమైతే టైప్ రైటర్ కూడా ఇవ్వొచ్చన్నారు.

అందుకు విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే అన్ని ఆధారాలు తీసుకుందని, అలాంటప్పుడు కేసు తారుమారు చేసే అవకాశం ఎక్కడిదని వాదించారు. కేసు తారుమారయ్యే అవకాశం లేదు కాబట్టి లాప్ టాప్ వినియోగించుకునే అవకాశమివ్వాలన్నారు. కాగా ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదికి వాయిదా వేసింది. కాగా ఇటీవల విజయ సాయి రెడ్డి తనకు లాప్ టాప్ లేదా కంప్యూటర్ ఇవ్వాలని, ఇంటర్ నెట్ ఉపయోగించుకోనని సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+