వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాఖలపై చిరంజీవి ఫైట్: కిరణ్ కుమార్ రెడ్డి ససేమిరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
హైదరాబాద్: తన వర్గానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వజూపిన మంత్రిత్వ శాఖలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇవ్వజూపిన శాఖలను తీసుకోవడానికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు నిరాకరించారు. మౌలిక సదుపాయాల కల్పన, జౌళి, దేవాదాయ శాఖల నుంచి ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కొత్త మంత్రులకు సూచించారు. అయితే, ప్రాధాన్యం లేని శాఖలను స్వీకరించడానికి వారు నిరాకరించారు. విద్యుత్తు, వాణిజ్య పన్నుల శాఖలు ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దీనిపై చిరంజీవి ముఖ్యమంత్రితో చర్చించారు. అయినా ఫలితం కనిపించలేదు.

ఈ నెల 6న గులాంనబీ ఆజాద్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాకు ఇస్తామన్న శాఖలు వేరని, ఇప్పుడు మీరు ఇస్తామంటున్న శాఖలు వేరని, తమకు విద్యుత్తు, వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించాలని చిరంజీవి చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదు. "ఇలా శాఖలు కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఎవరికి వారు తమకు ఇష్టమైన శాఖలు కావాలని అడుగుతారు. ఇది సంప్రదాయంగా మారే ప్రమాదముంది'' అని బదులిచ్చారు.

శాఖలపై తేడా రావడంతో సి రామచంద్రయ్య, గంటా తమ నేత చిరంజీవితో భేటీ అయ్యారు. ఆ తర్వాత గురువారం రాత్రి పీఆర్పీ ముఖ్య నేతలంతా నగర శివారులోని ఒక ఫామ్ హౌస్‌లో సమావేశమయ్యారు. అధిష్ఠానం అదేశించినప్పటికీ ముఖ్యమంత్రి ఇలా ఎందుకు చేస్తున్నట్లు అనే విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై మథనం సాగించారు. ఈ వివాదాన్ని ఢిల్లీ స్థాయిలో అధిష్టానంతోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం హైదరాబాదు వస్తున్న గులాం నబీ ఆజాద్ ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

English summary
Mega star Chiranjeevi camp is expressed it dissatisfaction over portfolios.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X