హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు కొత్త బిచ్చగాడు, ఫైట్ చేస్తే తొలగింపా?: తలసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Talasani Srinivas Yadav
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టినప్పుడు శంకర రావుకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సహచర మంత్రుల అవినీతిపై పోరాటం చేస్తున్నప్పుడు మాత్రం బర్తరఫ్ చేయడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగు ఓడిపోతామని తెలిసిన మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిపై పోరాటం చేస్తున్న శంకర రావు తొలగింపు శోచనీయమన్నారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కొత్త బిచ్చగాడని ధ్వజమెత్తారు. శంకర రావు తొలగింపుపై ఆ పార్టీ నేత దేవేందర్ గౌడ్ కూడా మండిపడ్డారు. అవినీతిపై పోరాడుతున్నందుకే దళితుడని కూడా చూడకుండా తొలగించారని విమర్శించారు.

ఆయన్ను తప్పించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అవినీతిపరులపై వేటు వేయకుండా అవినీతిపరులను వేలెత్తి చూపుతున్న వారిపై వేటు వేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలుబొమ్మగా మారారన్నారు. అధిష్టానం చెప్పింది తు.చ. తప్పకుండా పాటించడమే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో కిరణ్ ఉన్నారన్నారు. శంకర రావు తొలగింపు జాతికే అవమానమని మాల మహానాడు సంఘం అధ్యక్షుడు రత్నాకర్ కాకినాడలో అన్నారు. ఆయనను వెంటనే తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
TDP leader Talasani Srinivas Yadav questioned congress about Shankar Rao removal from Kiran Kumar Reddy cabinet. He accused that Chiranjeevi is new beggar in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X