వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరికృష్ణతో పార్టీకి విభేదాలు లేవు: ఎంపి సుజనా చౌదరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sujana Chowdary
విశాఖపట్నం: పార్టీకి, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి శుక్రవారం విశాఖపట్నంలో అన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హరికృష్ణకి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశంపై స్పందిస్తూ, ఆయన పోటీ విషయం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీ నేతలు చర్చించి ఎక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందో తేల్చుతారన్నారు. కాగా ఇటీవల బాలకృష్ణ తాను రాజకీయాల్లోకి వస్తానని కృష్ణా జిల్లా పర్యటనలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలుమార్లు రాజకీయ ప్రసంగాలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయన మరో అడుగు ముందుకేసి తాను పార్లమెంటు స్థానం నుండి కాకుండా అసెంబ్లీ స్థానం నుండే పోటీ చేస్తానని, అయితే ఎక్కడి నుండి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.

ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఎన్టీఆర్ ఘాట్‌కు హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు దగ్గుపాటి వెంకటేశ్వర రావుతో కలిసి రావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చంద్రబాబుతో కాకుండా లేదా ప్రత్యేకంగా రాకుండా దగ్గుపాటితో రావడం టిడిపికి దూరమవుతున్నారా అనే ప్రశ్నలు పలువురిలో తలెత్తాయి. అయితే తన తండ్రి స్థాపించిన పార్టీ కోసం కృషి చేస్తానని హరికృష్ణ, తాత ఆశయ సాధన కోసం కృషి చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేయడం విశేషం.

English summary
TDP MP Sujana Chowdary said that party does not have any differences with MP Harikrishna. He continued, Party high command will decide about Balakrishna contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X