సాటానిక్ చదివినవారిని అరెస్టు చేయండి: అసదుద్దీన్

Asaduddin Owaisi
హైదరాబాద్: సల్మాన్ రష్దీ రాసిన సాటానిక్ వెర్సెస్ పుస్తకాన్నిశుక్రవారం జైపూర్ రచయితల సమ్మేళనంలో చదివిన రచయితలను అరెస్టు చేయాలని మజ్లీస్ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. నిషేధిత పుస్తకాన్ని చదవడమంటే కావాలని రెచ్చగొట్టడమేనని, ఇస్లామ్ వ్యతిరేకంగా ఆ వేదిక ఉందనేది అది నిదర్శనమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. భారతదేశంలో నిషేధానికి గురైన ఆ పుస్తకాన్ని చదవడం ద్వారా నిర్వాహకులు, రచయితలు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.

వ్యవహారం రాజస్థాన్‌లోనే కాకుండా దేశంలోనే పరిస్థితిని విషమింపజేస్తుందని ఆయన అన్నారు. సాటానిక్ వెర్సెస్ చదివిన రచయితలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక పోలీసులను డిమాండ్ చేశారు. లిబరలిజం పేరు మీద ఇస్లాం, ముస్లిం వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదని ఆయన అన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడానికే లిబరలిజం పేరు ఎత్తుతున్నారని ఆయన అన్నారు. తనపై ఫత్వా విధించిన నేపథ్యంలో, తన భద్రతకు భారత ప్రభుత్వం ఏ విధమైన హామీ ఇవ్వని నేపథ్యంలో సల్మాన్ రష్దీ జైపూర్ రచయితల సమ్మేళనానికి దూరంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+