• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజీనామా చేసి గెలిస్తే మాట వింటాం: ఎర్రబెల్లికి నాయిని

By Srinivas
|

Nayini Narasimha Reddy-Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు రాజీనామా చేసి మళ్లీ గెలిచి మాట్లాడితే వింటామని, ఆ సత్తా ఆయనకు ఉందా అని టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి ఆదివారం సవాల్ విసిరారు. తమ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావును తెలంగాణ ద్రోహిగా ప్రకటించాలన్న ఎర్రబెల్లి వ్యాఖ్యలు సరికావన్నారు. నువ్వు, నీ పార్టీ ద్రోహులనే విషయం గత ఉప ఎన్నికల్లోనే జనం డిక్లేర్ చేశారని, కెసిఆర్‌ను జెఏసి మాదని, ఏదైనా ఉంటే ప్రజలు అడుగుతారని, వారికి మేము సమాధానం చెబుతామని, మధ్యలో నువ్వెవరని ప్రశ్నించారు. జెఏసి చాలా పవిత్రమైన సంస్థ అని, దానిపై వ్యాఖ్యానించే హక్కు నీకు లేదని, జెఏసి నుంచి కెసిఆర్‌ను బహిష్కరించాలని అడగటానికి నువ్వెవరు? నీ పార్టీని జెఏసి నుంచి ఎప్పుడో బహిష్కరించారని ధ్వజమెత్తారు. వాళ్ల ప్రాంతం కోసం పోరాడుతున్న ఆంధ్రోళ్లు కెసిఆర్ విషయంలో ఏదన్నా అన్నా, అడిగినా అర్థముందని, ప్రాంతం కోసం నువ్వు ఉద్యమించని నీకు ఎక్కడిదని మండిపడ్డారు.

మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లిలని జనమే తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సిగ్గు, నీతి, నిజాయితీ ఉంటే కెసిఆర్‌పై తప్పుడు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కాగా, హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లలో కొనసాగుతున్న కళాశాలలన్నింటినీ శివారుల్లోకి మార్చాలని నాయిని డిమాండ్ చేశారు. అక్కడైతే ఆట స్థలాలు, ఇతర వసతులు కల్పించే అవకాశం ఉంటుందని, ఈ విషయమై ఆలోచన చేయాలని కోరారు. ముగ్గురు మంత్రులున్నా విద్యా విధానం సరిగాలేదని, చివరికి కేంద్రం ఇచ్చే నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని చేతగానిస్థితిలో ప్రభుత్వం ఉన్నదన్నారు.

సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఎమ్మెల్యే కె తారక రామారావు సిరిసిల్లలో అన్నారు. చౌటుప్పల్ డిఎస్పీ ఉద్యమంలో పాల్గొన్న 19 మంది విద్యార్థులపై రౌడీషీట్ పెడతామంటూ బెదిరిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షను మరింత శక్తిమంతంగా చాటడానికి పోరాటం ఉధృతం చేస్తామని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ సెగ తగిలేలా ఈ ఉద్యమం ఉంటుందన్నారు.

English summary
TRS leader Nayini Narasimha Reddy challenged TDP senior MLA Errabelli Dayakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X