జాతీయ పార్టీలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం: కిషన్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతారా? లేక చస్తారా? అనే విషయం కాంగ్రెస్ నేతలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో సమాధానవివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎదుట ప్రదర్శన, ధర్నాను చేపట్టాలని సవాలు విసిరారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్, టిడిపికి స్పష్టమైన విధానమే లేదని, ప్రాంతానికో మాట మాట్లాడుకుంటూ తెలంగాణపై ఉద్యమిస్తున్న వారిని మాత్రం విమర్శిస్తున్నాయని దుయ్యబట్టారు బిజెపిని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని నిప్పులు చెరిగారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై బిల్లు ప్రవేశపెట్టకపోతే, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తామే తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ కోసం 750 మంది బలిదానం చేసుకున్నా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మనస్సు చలించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆత్మబలిదానాలకు సోనియాగాంధీ, చంద్రబాబులే బాధ్యత వహించాలని అన్నారు.












Click it and Unblock the Notifications