హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల్లో బాలయ్య పోటీ, అందుకే దూకుడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే ఉప ఎన్నికల్లో సినీ హీరో, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తారా అనే ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఉప ఎన్నికల కోసమే బాలకృష్ణ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారనేది మాత్రం వాస్తవం. రాష్ట్రంలో దాదాపు 26 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే వాతావరణం ఏర్పడి ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనభ్యులపై వేటు పడితే పెద్ద యెత్తున ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పటికైతే తెలంగాణలోని ఆరు సీట్లతో పాటు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఖాళీ అయ్యాయి. చిరంజీవిని కేంద్ర మంత్రిగా తీసుకుంటే తిరుపతి శాసనసభా నియోజక వర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. పరిస్థితి చూస్తుంటే 2014 సాధారణ ఎన్నికలకు ముందు వస్తున్న ఉప ఎన్నికలు సెమీ ఫైనల్‌గా కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద యెత్తున ఉప ఎన్నికలు వస్తున్నందు వల్లనే బాలకృష్ణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

బాలకృష్ణ ఎంట్రీ వల్ల ఉప ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక రకంగా బాలకృష్ణ ఉప ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారని చెప్పవచ్చు. ఉప ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి మరింతగా కలిసి వస్తుందని అంటున్నారు. బాలకృష్ణ చిరంజీవి రాజీనామా వల్ల ఖాళీ అయ్యే తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీకి దిగే ఆవకాశాలు కూడా లేకపోలేదని ప్రచారం సాగుతోంది. గతంలో బాలకృష్ణ తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూడా తిరుపతి నుంచి పోటీ చేశారు. తండ్రి వారసత్వాన్ని స్వీకరించడానికి తిరుపతిని నియోజకవర్గంగా ఆయన ఎన్నుకోవచ్చునని అంటున్నారు.

గతంలో మాదిరిగా కాకుండా బాలకృష్ణ పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ పార్టీకి ప్రమాదకరంగా మారిన చిరంజీవిపైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పైనా ఆయన విరుచుకుపడుతున్నారు. మరో రకంగా ఆ ఇద్దరు నాయకులను ఆయన రెచ్చగొడుతున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అలా వారికి తాను దీటైన సమాధానం ఇవ్వగలనని ఆయన ప్రజలకు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం, బాలకృష్ణ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

English summary
There is a rumor that TDP leader Balakrishna may contest in ensuing bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X