సునీల్ కస్డడీకి, సాయి రెడ్డి నార్కో టెస్టుకు సిబిఐ పిటిషన్

జగన్ కేసులోనే అరెస్టైన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి నార్కో టెస్ట్‌కు అనుమతివ్వాలని సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పలుమార్లు ఆయనను విచారించినప్పటికీ, రిమాండులోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సమాధానాలు రాబట్ట లేకపోతున్నందున నార్కో టెస్టుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను 30వ తేదికి వాయిదా వేశారు. కాగా ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి కోర్టు ఫిబ్రవరి 8వ తేది వరకు రిమాండ్ పొడిగించింది. శ్రీలక్ష్మిని చంచల్ గూడ మహిళా జైలులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications