హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సహన కోల్పోతున్నారా, అందుకే వ్యాఖ్యలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తన ముఖ్య అనుచరుడు సునీల్ రెడ్డి అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సహనం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సునీల్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన చేస్తున్న ప్రకటనలే అందుకు నిదర్శమని అంటున్నారు. మంగళవారం రాత్రి, బుధవారంనాడు ఓదార్పు యాత్రలో చేసిన వ్యాఖ్యలు జగన్ అంతరంగాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు. సిబిఐపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. తనను వేధించడానికి బదులు కాల్చేయవచ్చు కదా అని ఆయన మంగళవారం రాత్రి ఓదార్పు యాత్రలో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కాపాడుతూ తనకు సంబంధించినవారిని సిబిఐ వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. బుధవారంనాడు మరో అడుగు ముందుకేసి సునీల్ రెడ్డి తనకు బంధువు ఎలా అవుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో ఆయన ఆగిపోలేదు.

పులివెందులకు చెందినవారు రెడ్డి అయితే చాలు, ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ అమాయకులను వేధిస్తోందని ఆయన విమర్శించారు. తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కాగా, గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ ఈ నెల 27వ తేదీన వస్త్రవ్యాపారుల సమ్మెకు మద్దతుగా నర్సారావుపేటలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. తనకు సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయని భయపడే జగన్ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు దూళిపాళ నరేంద్ర తదితరులు విమర్శించారు. విజయసాయి రెడ్డి, సునీల్ రెడ్డి తర్వాత అరెస్టు తానే అవుతానని జగన్ అనుకుంటున్నారని వారు బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తనకు సునీల్ రెడ్డి ఎలా బంధువుతారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు విరుద్ధంగా ఆయనకు చెందిన సాక్షి దినపత్రికలో ఓ వార్తాకథనానికి శీర్షికను పెట్టారు. వైయస్ బంధువు సునీల్ రెడ్డి అరెస్టు అంటూ ఆ శీర్షికను పెట్టారు. అయితే, సునీల్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్న తీరును ప్రశ్నిస్తూ సాక్షి దినపత్రిక పెద్ద వార్తాకథనాన్ని ప్రచురించింది. సునీల్ లాంటి వైయస్ బంధువులను సిబిఐ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోందని విమర్శించింది. ఓఎంసి, సాక్షి పెట్టుబడులు, ఎమ్మార్ కేసు ఏదైనా లక్ష్యం జగనే అని వ్యాఖ్యానించింది.

English summary
Political analysts say that YSR Congress is loosing patience and making irrational comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X