పరిటాల హత్య కేసు ఎఫ్ఐఆర్‌లో జగన్ పేరు: తులసిరెడ్డి

Tulasi Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు ఎఫ్ఐఆర్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని కాంగ్రెసు నేత, ఏడు సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసి రెడ్డి బుధవారం అన్నారు. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియే జగన్‌పై సిబిఐ విచారణకు ఆదేశించారని అన్నారు. తన తండ్రి తనపై దొంగ కేసు పెట్టి వేధించారని జగన్ అనగలరా అని ప్రశ్నించారు. అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షి పత్రిక, టీవి ఛానల్‌తో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది జగనే అని విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డిపై కేసులకు, కాంగ్రెసు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని శాసనమండలి సభ్యుడు శివరామి రెడ్డి వేరుగా అన్నారు. ఆస్తుల కేసులో తనపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తన ఆస్తుల కేసుపై సిబిఐ విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+