హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి: ఓ చోట నిప్పు, మరో చోట ధ్వంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

NTR Statue
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కుల్చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ప్రభావం రాష్ట్రంలో ఇంకా కనిపిస్తూనే ఉంది. బుధవారంనాడు రెండు చోట్ల స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలపై దాడులు జరిగాయి. ఒక చోటు ఆయన విగ్రహానికి నిప్పు పెట్టగా, మరో చోట విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహానికి దండగులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మహేంద్రవాడలో దుండగులు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారి ఆందోళన కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల నల్లగొండ జిల్లా కోదాడలో కూడా ఎన్టీ రామారావు విగ్రహంపై దాడి జరిగింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలపై కూడా దాడులు జరిగాయి.

English summary
NT Rama Rao statues were attacked in two places in Andhra Pradesh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X