ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెండాకు, మహాత్ముడికి అవమానం: మరోవైపు పూజలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahatma Gandhi-Indian Flag
ఖమ్మం/మెదక్: 63వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలుచోట్ల జెండాకు, జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర రావు స్థానిక వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. అయితే ఆయన తన బూటు కాళ్లతోనే మహాత్మా గాంధీ చిత్రపటానికి అతి సమీపం నుండే ప్రసంగించారు. ఆయన అంగరక్షకులు కూడా అలాగే అక్కడ తచ్చాడారు. నిత్యం మహాత్ముడి పేరు స్మరించే కాంగ్రెసు పార్టీ నేత అయి ఉండి గాంధీని అవమానించడం అందరినీ కలిచి వేసింది. నల్గొండ జిల్లాలోని భువనగిరిలో నేతలు జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగుర వేశారు. అంతేకాకుండా జెండా పైన స్థానిక నేత ఫోటోను ఉంచారు. దీనిపై ఎబివిపి విద్యార్థులు మండిపడ్డారు. జాతీయ జెండాను అవమానించారంటూ ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో పంచాయతీరాజ్ కార్యాలయంలో జెండాను చెత్తబుట్టలో పడవేశారు.

గణతంత్ర దినోత్సవం రోజు కొన్నిచోట్ల జెండాకు, గాంధీకి అవమానం జరగ్గా మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో పూజలు చేశారు. మహాత్ముడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ గ్రామానికి గాంధీజీయే దేవుడు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్ముడు అంటే తమకు ఎంతో అభిమానమని, ప్రతి అక్టోబర్ 2, ఆగస్టు 15, జనవరి 26 నాడు మహాత్ముడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేస్తామని చెబుతున్నారు. నలభయ్యేళ్ల క్రితం తమ గ్రామ సర్పంచ్ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారని అప్పటి నుండి ఇది కొనసాగుతోందని చెబుతున్నారు. ప్రతి శుక్రవారం ఆయనకు పూజలు కూడా చేస్తారట.

English summary
District Congress leader from Khammam district insulted Mahatma Gandhi and Bhuvanagiri political leaders insulted national flag today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X