భానుకిరణ్ కోసం ప్రత్యేక టీమ్స్‌తో గాలింపు: డిజిపి దినేష్

DGP Dinesh Reddy
విజయవాడ: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కోసం స్పెషల్ టీమ్స్‌తో గాలింపు చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్ రెడ్డి శుక్రవారం విజయవాడలో విలేకరులతో అన్నారు. ఆయన కదలికలపై క్లూస్ వస్తున్నాయని చెప్పారు. అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను శనివారంలోగా పట్టుకుంటామని చెప్పారు. విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరున్నారనే విషయం విచారణ తర్వాత తేలుతుందన్నారు. ఇక నుండి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ తదితర మహానుభావుల విగ్రహాల రక్షణకు గ్రామ కమిటీ దళం ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డిఎస్పీ స్థాయి అధికారితో సబ్ డివిజనల్ కార్యాలయాలను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మహిళలపై వేధింపులు అరికట్టేందుకు త్వరలో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుండి ఎస్ఐల ప్రమోషన్లు జోన్ల వారిగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి చేస్తామన్నారు. యానాం రీజెన్సీ కంపెనీ ఘటనపై స్పందిస్తూ.. కాకినాడ నుండి యానాంకు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసు బలగాలను పంపించామని చెప్పారు. కాగా అమలాపురం నియోజకవర్గంలో మంత్రివర్గ బృందం అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమైన చోట పరిశీలించింది. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు మంత్రివర్గ సంఘాన్ని కోరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+