వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ ఎన్నికల్లో హింస, ఐదుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Manipur Map
ఇంఫాల్: మణిపూర్ శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో శనివారం ఐదుగురు మరణించారు. చందేల్ నియోజకవర్గంలో దుండగులు పోలింగ్ బూత్‌‌పై దాడి చేయడానికి ప్రయత్నంచారు. ఈ సమయంలో కాల్పులు జరిగాయి. మణిపూర్ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతోంది. చందేల్‌లోని ఓ పోలింగ్ బూత్‌ను ఆక్రమించుకోవడానికి దుండగులు ప్రయత్నించారు. ఈ సమయంలో దుండగులకు, సిఆర్‌పిఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఎదురుకాల్పుల్లో ఓ సిఆర్‌పిఎఫ్ జవానతో పాటు ఓ మహిళ, ముగ్గురు అధికారులు మరణించినట్లు సమాచారం. మణిపూర్ శానససభ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మిలిటెంట్లు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ మెరుపు దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు. పోలింగు స్టేషన్ల సమీపంలో పాతిపెట్టిన నాలుగు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేశారు. ఉక్రుల్ జిల్లాలో మిలిటెంట్లు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. శనివారం స్వాధీనం చేసుకున్న బాంబులను మిలిటెంట్లు పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలింగ్‌ను అడ్డుకోవడానికి మిలిటెంట్లు ఆ పనికి పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

గత గురువారంనాడు 80 ఏళ్ల మహిళ మరణించింది. తమెన్‌గాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మిలిటెంట్లు బాంబులతో కాంగ్రెసు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ సంఘటనలో మహిళ మరణించింది.

English summary
Two CRPF personnel on poll duty were killed in an ambush by militants even as four powerful bombs planted near polling stations were seized and defused before polling for the Manipur Assembly began Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X