టిడిపిని అంటిపెట్టుకుని లేం: రాఘవులు స్పష్టీకరణ

BV Raghavulu
హైదరాబాద్: తాము తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని లేమని, అది బూర్జువా పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. తెలుగదేశం పార్టీ చూపించే పరిష్కారాలతో సమస్యలు తీరవని ఆయన అన్నారు. సిపిఐ కార్యాలయం మఖ్దూం భవన్‌లో 11 వామపక్షాలు సమావేశమై ఐక్య కార్యాచరణ గురించి చర్చించాయి. ఈ సమావేశానంతరం శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వామపక్షాలతో కలిసి తాము ఐక్య ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో తప్ప మిగతా సమయాల్లో ఎవరి ఎజెండా వారిది అని ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్ర విభజనపైనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దృష్టి పెట్టాయని ఆయన అన్నారు.

పోలీసులతో కుమ్మక్కయి రీజెన్సీ సిరామిక్స్ యాజమాన్యమే యానాంలో కార్మిక నాయకుడిని చంపించిందని ఆయన ఆరోపించారు. యానాం ఘటనకు పూర్తి బాధ్యత యాజమాన్యానిదే అని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై పూర్తి స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. రేపు ఆదివారం వామపక్షాల ప్రతినిధి బృందం యానాం సందర్శించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+