హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని హైదరాబాద్ పర్యటన రద్దు వెనక ఎంపిల లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

PM Manmohan Singh
హైదరాబాద్: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హైదరాబాద్ పర్యటన రద్దు వెనక పార్లమెంటు సభ్యుల పాత్ర ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాజీవ్ యువకిరణాలు పథకాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రధాని హైదరాబాదులో ప్రారంభించాల్సి ఉంది. అయితే, దానిలోని లోపాలను, ఇతర అంశాలను ఎత్తి చూపుతూ తెలంగాణకు చెందిన కొంత మంది పార్లమెంటు సభ్యులు ప్రధానికి లేఖ రాశారని తెలిసింది. అయితే, ఢిల్లీకి విదేశీ అతిథులు రావడమే పర్యటన రద్దుకు కారణమని సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో మొత్తం 15 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని కొందరు ఎంపీలు నాలుగు రోజుల కిందట ప్రధానికి లేఖ రాసినట్లు తెలిసింది.

ప్రజల్లో దీనిపై ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయని, ప్రైవేటు కంపెనీల యజమానులు తమకు అనుకూలురైన సిబ్బందిని మాత్రమే నియమించుకుంటారని, ప్రభుత్వ సిఫారసుల మేరకు ఉద్యోగం ఇచ్చినా వారి సామర్థ్యం పరిశీలించి, తమకు అనువుగా లేకుంటే పక్కకు తప్పిస్తారని అశాశ్వతమైన ప్రైవేటు ఉద్యోగాలను కల్పించే పథకానికి అట్టహాసంగా ప్రారంభోత్సవాలను నిర్వహించడం మంచిదా, కాదా ఆలోచించుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో వారు వివరించినట్లు తెలిసింది. రాజీవ్ యువ కిరణాల కింద ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు జరుగుతున్నట్లు యువత భావిస్తోందని, అందుకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థల్లో వెల్డర్లు, ఫిట్టర్లు వంటి చిన్న చిన్న ఉద్యోగాలను ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటని కూడా అందులో ప్రశ్నించారు.

English summary
It is said that PM Manmohan Singh has cancelled his Hydearabad visit due to MPs letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X