ఇక్కడ చంద్రబాబు: అక్కడ తెరాస అధినేత కెసిఆర్

రాష్ట్రంలో ఎటు చూసినా ఆందోళనలే అని కెసిఆర్ అన్నారు. విద్యార్థులు, వస్త్రవ్యాపారులు, జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆందోళనలు చేస్తే ఎస్మా ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. జూడాల సమ్మె కొత్తది కాదని, స్టయిఫండ్ పెంపు కోసం వారు రాజీలేని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళా డాక్టర్లను కూడా అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ్యోద్యోగులు 40 రోజులు సమ్మె చేసినా ఏమీ చేయలేకపోయారని, జూడాలు ఏం చేస్తారని ముఖ్యమంత్రి అనడం దారుణమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి అహంకారపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications