ఎవరినీ టార్గెట్ చేయలేదు, కల్పిత వార్తలొద్దు: సిబిఐ జెడి

నిందితులపై తాము థర్డ్ డిగ్రీ ప్రయోగించామన్న వార్తలు అవాస్తవమన్నారు. తాము ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని విచారణ జరపడం లేదన్నారు. అలాంటి ఆలోచన తమకు ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. సిఎస్‌తో కేసుల పురోగతిపై కూడా చర్చించామన్నారు. శ్రీలక్ష్మి పేరును ఛార్జీషీట్‌లో చేర్చే అంశంపై కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఎమ్మార్ విల్లాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనన్నారు. విచారణ కోసం ప్రభుత్వం తరఫున మేం సహకారం కోరుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications