హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీకూ ఎదురు కావచ్చు: తల్లి విజయమ్మ లేఖపై జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తాను ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్య రేపు మీకూ ఎదురు కావచ్చు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ దర్యాప్తు తీరును తప్పు పడుతూ తన తల్లి వైయస్ విజయమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖను సమర్థించుకుంటూ ఆయన ఆ విధంగా అన్నారు. ఆయన మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను ఎదుర్కుంటున్న పరిస్థితి ఎవరికైనా ఎదురు కావచ్చునని, అటువంటి తీరుపై గొంతు విప్పాల్సి ఉంటుందని, నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పరిస్థితిని ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. విజయమ్మ రాసిన లేఖకు తగిన ఫలితం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని పరిస్థితిని వైయస్ విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో వివరించారని ఆయన చెప్పారు. లేఖలను చదివిన తర్వాత ప్రధాని ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రాశారని ఆయన అన్నారు. తన లేఖలో విజయమ్మ వాస్తవాలను వివరించారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఆయన మంగళవారం జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.

English summary
YSR Congress president YS Jagan supported his mother YS Vijayamma in writing a letter to PM Manmohan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X