వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పకు షాక్, విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇది యడ్యూరప్పకు ఎదురు దెబ్బేనని చెప్పాలి. అవినీతి కేసులకు సంబంధించి ఆయన చేసిన విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. తనపై లోకాయుక్త చేస్తున్న దర్యాప్తును ఆపించాలని కోరుతూ ఆయన హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రెండు కేసుల్లో యడ్యూరప్పపై లోకాయుక్త దర్యాప్తు చేస్తోంది. అవి భూమి అక్రమ డీనోటిఫికేషన్‌కు సంబంధించిన కేసులు.

ఆ కేసులకు సంబంధించి గతంలో కోర్టు యడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది. కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో 25 రోజులు ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి పదవి కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

English summary
It might be proved as a major setback for the former Chief Minister of Karnataka - BS Yeddyurappa as Karnataka High Court on Tuesday, Jan 31 rejected his plea regarding two corruption cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X