హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిపి ఆచార్య పేరు చేరుస్తూ 12మందిపై ఛార్జీషీట్ దాఖలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో వెయ్యి పేజీలతో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేశామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ బుధవారం చెప్పారు. ఎమ్మార్ కేసులో సిబిఐ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. అనంతరం జెడి లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు. బిపి ఆచార్య ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఛార్జీషీట్‌లో ఆచార్య పేరు ఉన్నదని చెప్పారు. వెయ్యి పేజీలతో ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. కాగా ఆరు ట్రంకు పెట్టెల్లో ఛార్జీషీట్ పత్రాలను సిబిఐ అధికారులు కోర్టుకు తీసుకు వచ్చారు. మొదట ముగ్గురు పేర్లతోనే ఛార్జీషీట్ దాఖలు చేశారనే వార్తలు వచ్చినప్పటికీ, కేసులో ఎ-1 నిందితుడు అయిన బిపి ఆచార్య పేరు కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సుమారు 270 మందిని సిబిఐ విచారించింది. పన్నెండు మంది పేర్లుఇందులో పేర్కొన్నట్లుగా సమాచారం.

ఎమ్మార్ విల్లాలో ఎపిఐఐసి వాటా భారీగా తగ్గినట్లుగా సిబిఐ గుర్తించినట్లు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఎమ్మార్ విల్లాల్లో భారీ అక్రమాలు జరిగాయని, ఎపిఐఐసి ప్రమేయం లేకుండానే విల్లాల విక్రయం జరిగిందని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఛార్జీషీట్‌లో బిపి ఆచార్య, ఎమ్మార్ ప్రాపర్టీస్, మహ్మద్ అల్ అబర్, ఎమ్మార్ ఎంజిఎఫ్, ఎమ్మార్ హిల్స్, కోనేరు ప్రసాద్, శ్రీకాంత్, బౌల్డర్ హిల్స్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.విశ్వేశ్వర రావు, తుమ్మల రంగారావు, కోనేరు మధు పేర్లను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఛార్జీషీట్‌లో ముగ్గురు ఐఏఎస్‌లను నిందితులుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. విజయ రాఘవ, సునీల్ రెడ్డి, శ్రవణ్ గుప్త పేర్లను ప్రస్తావించలేదు.

కాగా సునీల్ రెడ్డి, విజయ రాఘవ, కోనేరు ప్రసాద్ జ్యూడిషియల్ రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 15వ తేది వరకు పొడిగించింది. సిబిఐ వేసిన కస్టడీ పిటిషన్ పైన ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది.

English summary
CBI filed chargesheet in EMAAR case today in CBI special court. CBI JD Laxmi Narayana said they will filed it court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X