సిబిఐ దర్యాప్తు: నేతల తలరాతలు మారుతాయా?

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రతి రోజూ సిబిఐ దర్యాప్తు తీరును తప్పు పడుతూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. వైయస్ జగన్‌ను, తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని సిబిఐ దర్యాప్తు కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. సిబిఐ దర్యాప్తు కుట్రపూరితంగా సాగుతోందని విమర్శిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు వారిని ఎక్కువగా కలవరపెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్ జగన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న సునీల్ రెడ్డి అరెస్టు తర్వాత వైయస్సార్ కాంగ్రెసు నాయకులు సిబిఐ దర్యాప్తుపై ప్రతి రోజూ విరుచుకుపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశించిన ప్రాథమిక విచారణ ఆగిపోయింది. ఆ వ్యవహారం ఇంకా కోర్టులో నలుగుతోంది. ఎమ్మార్, వైయస్ జగన్ ఆస్తులు, అక్రమ మైనింగ్ కేసులపై జరుగుతున్న సిబిఐ విచారణ పరిణామాలు చంద్రబాబుకు ఆనందం కలిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఈ విషయాన్ని పట్టిస్తోంది. కాంగ్రెసు నాయకులు మాత్రం, కొద్ది మంది తప్ప, పెద్దగా ఎవరూ మాట్లాడడం లేదు. సిబిఐ దర్యాప్తు వ్యవహారాలు వైయస్ జగన్‌కు మైనస్‌గా మారి, చంద్రబాబుగా ప్లస్ అవుతుందా చర్చ సాగుతోంది. ఆ విషయాన్ని ఇప్పుడే తేల్చే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications