వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌వల్ల కాంగ్రెస్ పీడ వదులుతోంది: సిపిఎం రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి కాంగ్రెసు పీడ వదిలి పోతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు బుధవారం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు ఇప్పటికే ముఠా కుమ్ములాటల్లో మునిగి పోయిందని, వైయస్ జగన్ వల్ల అది మరింత బలహీన పడుతోందని తద్వారా రాష్ట్రానికి కాంగ్రెసు పీడ త్వరలో వదిలి పోనుందని ఆయన అన్నారు. తాము తెలుగుదేశం పార్టీకి దగ్గరగానో లేదో దూరంగానో లేమన్నారు. 2009 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఎవరికి వారం ఉద్యమిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు తాము వ్యతిరేకమని, ఈ విషయంలో ఇప్పటికే మేం స్పష్టత ఇచ్చినందువల్ల ప్రజలు తమను నమ్ముతున్నారన్నారు.

ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా ఉండదల్చుకోలేదన్నారు. ప్రధాన పార్టీలు ఇబ్బందుల్లో ఉన్నందున కమ్యూనిస్టు పార్టీలు పుంజుకుంటాయన్నారు. పార్టీ గడ్డుకాలంలో తాము మహా సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఏం చేయలేక పోయామన్నారు. ప్రజా సమస్యలపై మరింత ఉద్యమిస్తామన్నారు. రాబోయే రోజులు కమ్యూనిస్టులవేనని ఆయన అన్నారు. 2014లో జగన్ భవితవ్యం ఎలా ఉంటుందో జోస్యం చెప్పలేమన్నారు. కాగా ఖమ్మంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహా సభల్లో జానపద నృత్యాలు అలరిస్తున్నాయి.

English summary
CPM BV Raghavulu said that Congress Party will disappear with YSR Congress Party chief YS Jaganmohan Reddy effect and group fights in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X