జయలలితకు శశికళ స్లో పాయిజన్ ఇచ్చారా?

Jayalalitha-Sasikala
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో శశికళ వ్యవహరించిన తీరుపై తెహెల్కా పత్రిక ప్రచురించిన వార్తాకథనం సంచలనం సృష్టిస్తోంది. శశికళను, ఆమె భర్త నటరాజన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా పోయెస్ గార్డన్ నుంచి గెంటేసిన తర్వాత ఇన్నాళ్లకు కొత్త విషయాలే కాకుండా సంచలన విషయాలను ఆ పత్రిక బయటపెట్టింది. ముఖ్యమంత్రి జయలలితకు శశికళ స్లో పాయిజన్ ఇచ్చినట్లు ఆ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. స్లో పాయిజన్ ఇవ్వడం ద్వారా జయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని శశికళ కుట్ర పన్నారని వెల్లడించింది.

జయలలిత ఆహార వ్యవహారాలను చూసే నర్స్‌ను శశికళే నియమించిందని, ఆ నర్సు ద్వారా జయలలిత భోంచేసే పదార్థాల్లో తక్కువ మోతాదులో ఉండే విషతుల్య పదార్థాలను కలుపుతూ వచ్చిందని ఆ పత్రిక రాసింది. అయితే ఈ వివరాలు ఎవరు చెప్పారన్న దానిపై ఆ పత్రిక ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తెహెల్కా కథనం ప్రకారం - 55 ఏళ్ల శశికళ మన్నార్కుడి మాఫియాతో చేతులు కలిపి ఆమె స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్రణాళిక రచించింది. అంతేకాదు ఈమధ్య అక్రమాస్తుల కేసు విషయంలో బెంగళూరు కోర్టుకు హాజరైనప్పుడు కూడా మన్నాక్కుడి మాఫియా చెప్పినవిధంగా జయ అక్కడి వెళ్లింది. ఒకవేళ కోర్టులో చుక్కెదురైతే, తను విశ్వసించేవారికి అధికార పీఠాన్ని కట్టబెట్టాలని అనుకున్నది.

శశికళ కుట్రను జయలలితకు చేరవేసింది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అని ఆ పత్రిక రాసింది. దానికి సంబంధించిన వివరాలను ఆ పత్రిక ఇలా రాసింది - ఎన్నారై వ్యాపారవేత్త ఒకరు తమిళనాడులో ఓ భారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వచ్చాడట. ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు ఆ వ్యాపారవేత్త సమాయత్తమవుతున్న దశలో మన్నార్కుడి జోక్యం చేసుకుని ప్రాజెక్టులో 15 శాతం వాటా ఇవ్వమని కోరిందట. దీంతో సదరు ఎన్నారై తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రాజెక్టును గుజరాత్‌లో స్థాపించాడట. ఆ సందర్భంలో జయ చుట్టు ఉన్న జనం గురించి నరేంద్ర మోడీకి తెలియడంతో, ఆయన ముఖ్యమంత్రి జయలలితను హెచ్చరించారు. విషయం తెలుసుకున్న జయలలిత వెంటనే స్పందించి శశికళను, ఆమెకు మద్దతుగా ఉన్న మంత్రులతోపాటు ఇతర వ్యక్తులను సైతం పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+