వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ దోపిడితో పోలిస్తే స్టైఫండ్ ఎక్కువ కాదు: శంకర్రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దోపిడీతో పోలిస్తే జూనియర్ డాక్టర్లకు ఇచ్చే స్టైఫండ్ ఎక్కువ కాదని మాజీ మంత్రి శంకర రావు గురువారం అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జూడాలకు శంకర రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్, గాలి దోపిడితో పోలీస్తే స్టైఫండ్ పెద్ద మొత్తం కాదన్నారు. దేశంలో దోపిడీ చేసే వారు ఎక్కువై పోయారని ఆయన అన్నారు. కొందరు లక్షల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. కాగా జూడాల సమస్యలు తీర్చాలని శంకర రావు సంబంధిత మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.

కాగా అంతకుముందు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ, తమ సమస్యలు, డిమాండ్లపై సర్కారు దిగి వచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఐదుగురు జడాలు దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు విశాఖ జూడాలు డిఎల్ రవీంద్రా రెడ్డిపై మండిపడ్డారు. కెజిహెచ్ వద్ద వారు చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కాగా జూడాల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అఖిలపక్షం కలవనుంది. జూడాలు కూడా చర్చలో పాల్గొననున్నారు.

English summary
Former minister Shankar Rao compared YS Jaganmohan Reddy and Gali Janardhan Reddy propertie with JUDAs stipend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X