వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ హయాంలోనే ఎమర్జెన్సీ: జగన్‌పై విహెచ్ ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ లేఖపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు గురువారం మండిపడ్డారు. సిబిఐపై ఒత్తిడి తీసుకు వచ్చి పక్కదారి పట్టించేందుకే వైయస్ విజయమ్మ లేఖ రాశారని ఆయన ధ్వజమెత్తారు. సిబిఐ విచారణ కాంగ్రెసు పార్టీ వేయించలేదని హైకోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు దమ్ముంటే సిబిఐ విచారణ వేయాలని సవాళ్లు విసిరి ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీని తలపిస్తోందన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెసు కార్యకర్తలు ఎమర్జెన్సీని అనుభవించారన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పలుకుబడి ఉపయోగించుకొని బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కారన్నారు. వైయస్ హయాంలో కార్యకర్తలు హింసించబడ్డారని అన్నారు.

జగన్ ఓదార్పు యాత్ర పేరుతో కాంగ్రెసు, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పత్రిక, టివి ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారని విమర్శించారు. సింపతి కోసమే జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. విచారణ ద్వారా వాస్తవాలు బయటకొస్తాయన్నారు. అవినీతి నేతల వల్ల ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పుడు జైళ్లో ఉన్నారన్నారు. కాంగ్రెసు అవినీతిని సహించదని, రాజా, కల్మాడీ వంటి నేతలను జైళ్లో పెట్టిందన్నారు. సిబిఐ జెడి లకాష్మీ నారాయణపై తమకు నమ్మకముందన్నారు. సిబిఐ దర్యాఫ్తు కక్షనో, ద్వేషమో కాదన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారి నుండి డబ్బు రికవరీ చేయాలని అన్నారు. అవినీతిపరులను జైలుకు పంపించాల్సిందేనన్నారు. అలాంటి శిక్షలతోనే అవినీతి చేసేందుకు ఎవరైనా భయపడతారన్నారు. కాగా ఈ అంశంపై ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు.

English summary
Congress senior leader V Hanumantha Rao blamed late YS Rajasekhar Reddy ruling. He also fired at YS Jagana and YS Vijayamma's letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X