హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంక్‌కు రూ.20 కోట్ల బంగారం కుచ్చుటోపీ, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: నకిలీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్‌గా తీసుకొని ఓ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడిని గురువారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్‌ను లోన్‌గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్‌బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.

అయితే అతను ష్యూరిటీ డాక్యుమెంట్లపై అనుమానం వచ్చిన ఎస్‌బిఐ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు పత్రాలు పంపించారు. అవి చూసిన ఆ బ్యాంకు అధికారులు అవి తమవి కావని చెప్పడంతో సంజయ్ మోసం చేశాడని భావించిన ఎస్‌బిఐ బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబిఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాంపల్లి కోర్టులో ఆయనను హాజరు పర్చారు. కోర్టు పదహారో తేది వరకు నిందితుడికి జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

English summary
CBI arrested gold shop owner today for loan with fake documents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X