వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి కేసు: కేంద్రానికి ఎదురుదెబ్బ, చిదంబరంకు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: 2జి కుంభ కోణం కేసులో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2008 సంవత్సరం తర్వాత దక్కించుకున్న 122 టెలికాం లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ లైసెన్సులు అన్నీ రాజా హయాంలోనే జరిగినవి కావడం విశేషం. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి చిదంబరంకు మాత్రం ఈ కేసులో ఊరట దక్కింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించాలన్న జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పిటిషన్ పైన స్పందించిన కోర్టు ఆయనను విచారించాలా వద్దా అని నిర్ణయించాల్సింది ట్రయల్ కోర్టు అని పేర్కొంది. ఆయనపై సిబిఐ విచారణకు ఆదేశించేది లేదని తేల్చి చెప్పింది. 2జి కేసును సిట్‌కు అప్పగించాలన్న ప్రశాంత్ భూషణ్ పిటిషన్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

కాగా రద్దు చేసిన 122 లైసెన్సుల స్థానాల్లో కొత్త వాటిని చట్టాలకు అనుగుణంగా నాలుగు నెలల్లో భర్తీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ లైసెన్సులు గతంలో చట్టాలకు అనుగుణంగా కాకుండా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని పేర్కొంది. వీటిని యాక్షన్ ద్వారా 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా ఇటీవల 2జి కుంభకోణం కేసులో చిదంబరం పాత్ర పైన కూడా విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

English summary
In a major setback for the government, the Supreme Court on Thursday quashed all 122 spectrum licences granted after January 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X