నోటిని అదుపులో పెట్టుకో:కెసిఆర్‌కు పొంగులేటి హెచ్చరిక

టిఆర్ఎస్ నేత కెసిఆర్ తెలంగాణ అంశం పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిచ్చి పట్టిందంటున్న కెసిఆర్‌కే పిచ్చి పట్టిందన్నారు. ఆయన దౌర్భాగ్యం వల్లనే తెలంగాణ ఉద్యమం ఈ పరిస్థితికి వచ్చిందన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ ప్రజల నుండి తప్పించుకు తిరుగుతున్న కెసిఆర్‌కు కిరణ్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని మరో ఎమ్మెల్యే తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి వేరుగా విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు లక్షకు పైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధితో 14ఎఫ్ రద్దు చేసేందుకు సిఎం కృషి చేశారన్నారు. జూడాల అంశాన్ని కెసిఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయనపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని, ఆయన ఎలాంటి కార్యాచరణకు సిద్ధపడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications