వైయస్ఆర్‌కు గుడి, జగన్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట

కాగా జగన్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత విశాఖ వస్తున్నారు. గత ఏడాది మే 31న విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్ తిరుగు ప్రయాణంలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఇంట్లో బస చేశారు. ఆ మర్నాడు విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లారు. అయితే తాజాగా నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప కుమార్తె, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు కుమారుడి వివాహానికి ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications