ఐఎఎస్‌ల అరెస్టుకు వైయస్ కారణం: చంద్రబాబు

Chandrababu Naidu
రాజమండ్రి/ హైదరాబాద్: వివిధ కేసుల్లో ఐఎఎస్ అధికారుల అరెస్టులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని నిందించారు. ఐఎఎస్ అధికారుల అరెస్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఎఎస్ అధికారులకు తమ ప్రభుత్వ హయాంలో పదోన్నతులు కల్పిస్తే కాంగ్రెసు ప్రభుత్వం వారిని జైలు పాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ల మూలవిరాట్లను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకరించారని ఆయన విమర్శించారు. దేశాన్ని పాలించే అర్హతను కాంగ్రెసు పార్టీ కోల్పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలన అవినీతిమయంగా మారిందని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారి వివరాలను వెల్లడించేందుకు ఐఎఎస్ అధికారులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. తప్పు జరిగిందని అంగీకరిస్తే సరిపోదని, ఏయే తప్పులు ఎవరి వల్ల జరిగాయనే విషయాలను బయట పెట్టాలని బాధ్యత అధికారులపై ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవినీతి మంత్రులకు శిక్ష పడేలా వెంటనే నిజాలను సిబిఐ ముందు చెప్పాలని ఆయన ఐఎఎస్ అధికారులకు సూచించారు. ఐఎఎస్, ఐపియస్ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టి అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆనయ అన్నారు. ఐఎఎస్ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రి తక్షణం వెల్లడించాలని మరో నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+