పంకజ్ ద్వివేది వ్యాఖ్యలపై గుర్రుమంటున్న ఐఎఎస్‌లు

పంకజ్ ద్వివేది వ్యాఖ్యల నేపథ్యంలో, ముఖ్యమంత్రి నిర్దిష్టమైన హామీ ఇవ్వని స్థితిలో ఐఎఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం శనివారం సాయంత్రం ఐదు గంటలకు జరుగుతోంది. సిబిఐ విచారణ తీరుపై పోరాటానికి సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఉన్న ఐఎఎస్ అధికారులు వర్కు టూ రూల్‌కు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే, ఐఎఎస్ అధికారుల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు చెప్పిన అన్నింటినీ ఐఎఎస్ అధికారులు అంగీకరించాల్సిన అవసరం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంతకాలు చేయాల్సిన అవసరం లేదని, అటువంటి సందర్భాల్లో బదిలీ అవుతారు గానీ అంతకు మించి ఏమీ కాదని, అటువంటప్పుడు రాజకీయ నాయకులు చేసిన ప్రతిదానికీ తలూపడం సరైంది కాదని కొంత మంది అంటున్నారు. అయితే, ఈ వాదన వల్ల సిబిఐ దర్యాప్తు తీరుపై చేస్తున్న పోరాటానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఏమైనా, రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు తీవ్రమైన చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications