ఏ ప్రలోభాలకు లొంగారో చెప్పాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

శాసన మండలి నైతిక విలువల కమిటీకి ఆయన రాజీనామా చేశారు. అనుభవం లేనివారిని, అమాయకులను కమిటీల్లో వేశారని ఆయన విమర్శించారు. చీఫ్ విప్ సూచనలను కూడా పాటించడం లేదని ఆయన విమర్శించారు. సీనియర్లను అగౌరవపరిచారని ఆయన అన్నారు. అనుభవం లేనివారిని, అమాయకులను కూడా వేయడం ద్వారా పొరపాట్లు చేశారని ఆయన అన్నారు. వివక్ష అనడానికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. శాసనమండలి కమిటీల విషయంలో కాంగ్రెసు సీనియర్ ఎమ్మెల్సీలు కునుకుల జనార్దన్ రెడ్డి, కెఆర్ ఆమోస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలి కమిటీల్లో తాము ఉండబోమని వారు ఇది వరకే ప్రకటించారు.












Click it and Unblock the Notifications