వైయస్ జగన్ మనుషుల మధ్య పని చేయలేం: వైద్యులు

కడప ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పులివెందుల పట్టణంలో ఇటీవల ఓ రోడ్డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దివాకర్ అనే వ్యక్తి కొనఊపిరితో 108లో ఆసుపత్రికి వచ్చారని, చికిత్స చేస్తుండగానే మరణించారని వారు చెప్పారు. అయితే, దివాకర్ మృతికికి వైద్యులే బాధ్యులని జగన్ వర్గం మనుషులు ఆరోపిస్తూ పరుష పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని ఆరోపించారు. ఓపీ విభాగం అద్దాలు ధ్వంసం చేసి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications