హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మిపై సారి, సబిత బయట ఆమె జైళ్లోనా: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPI Narayana
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జైళ్లో ఉంటే, నాటి గనుల శాఖ మంత్రి, ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాత్రం బయట ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం ఆక్షేపించారు. మైనింగ్ కేసులో సబితను కూడా బాధ్యురాలిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులకు తెలియకుండా ఐఏఎస్‌ అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేరన్నారు. అధికారులు నేతలు చేసే మౌఖిక ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. చట్టబద్దం కానివి అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని నేతలను అధికారులు కోరాలని సూచించారు. అవినీతి నేతలు దర్జాగా బయట తిరుగుతుంటే ఆదేశాలు పాటించిన అధికారులు మాత్రం అరెస్టవుతున్నారన్నారు. అధికారులు చట్ట విరుద్ద ఆదేశాలు తిరస్కరించ వచ్చునని అన్నారు. ఐఏఎస్ అధికారులు అందరూ అవినీతిపరులు కాదన్నారు. అధికారులు అవినీతికి వ్యతిరేకంగా పోరాటే చేస్తే మేం మద్దతిస్తామన్నారు. రాజకీయ జోక్యం లేకుండానే అధికారులు అవినీతికి పాల్పడే ఆస్కారం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న అవినీతికి ప్రథమ ముద్దాయి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కేబినెట్ అన్నారు. శ్రీలక్ష్మిని తాను ఉద్దేశ్య పూర్వకంగా అనలేదని, అందుకు ఎవరైనా బాధపడితే తాను సారీ చెబుతున్నానని నారాయణ అన్నారు.

ఐఏఎస్‌లు తమ అధికారాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో వేరుగా ప్రశ్నించారు ఇప్పుడున్న మంత్రులంతా వైయస్ హయాంలో ఉన్న వారేనని, వారిందరి పైనా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రులను వదిలి ఐఏఎస్‌లను శిక్షించడం సరికాదన్నారు. అధికారులు చట్ట వ్యతిరేక ఆదేశాలు ఎందుకు పాటిస్తున్నారన్నారు. అమాయక అధికారులపై చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. అవినీతి మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

English summary
CPI Narayana accused Home minister Sabitha Indra Reddy OMC case. He demanded to ministers cbi enquiry in such cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X