హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడో మంత్రి పదవి పైనే సిఎం కిరణ్ రెడ్డి తర్జన భర్జన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy-Kista Reddy
హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణ కోసం కాంగ్రెసు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోకి తీసుకునే వారిపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి పదవులు ఖాళీ అయినందున కేవలం ఆ ప్రాంతం నేతలనే కేబినెట్లోకి తీసుకోవాలని అధిష్టానం సూచించారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, పి.కిష్టా రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి శంకర రావు దళిత నేత కావడంతో ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణవాదం పేరుతో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకోనున్నారు.

ఈ ఇద్దరిని కేబినెట్లోకి తీసుకోవడానికి ఎలాంటి సమస్య లేకున్నప్పటికీ మూడో దాని విషయంలోనే సిఎం తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. మూడో పదవి కోసం వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకట రమణా రెడ్డి, మెదక్ జిల్లా నారాయణఖేడ్ సీనియర్ ఎమ్మెల్యే పి.కిష్టా రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకొని, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని సిఎం యోచిస్తున్నట్లుగా సమాచారం. మల్లు భట్టిని మంత్రివర్గంలోకి తీసుకోనున్న నేపథ్యంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది.

English summary
There is, however, confusion over the third inductee. Sources said that it would be a toss between P.Kista Reddy or Gandra Venkata Ramana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X