బాలకృష్ణతో ఒరిగేదిలేదు, అప్పుడే ఓడింది: లక్ష్మీపార్వతి

Laxmi Parvathi
తిరుపతి: హీరో నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసినా ఏం లాభం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో టిడిపి ఓడిపోయిందని ఆమె అన్నారు. బాలయ్య వ్యక్తిత్వం లేని మనిషి అని ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గల్లంతు కావడం ఖాయమన్నారు. ప్రజా సమస్యలపై చంద్రబాబుతి వ్యక్తిత్వం లేని పోరాటమన్నారు. సిబిఐ విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఆమె ఆరోపించారు. ఒకవేళ విచారణ న్యాయబద్దంగా జరిగితే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లే వారన్నారు.

చంద్రబాబుతో ఎవరు జతకట్టినా ప్రజలు నమ్మరన్నారు. ఎమ్మార్‌కు మూల కారకుడు చంద్రబాబేనని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలు తమను నమ్మడం లేదని తెలిసే కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలకు ధైర్యంగా వెళ్లడం లేదన్నారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ ప్రచారం చేసినప్పటి నుండి లక్ష్మీ పార్వతి ఆయన పైన కూడా విమర్శలు చేస్తున్నారు. టిడిపిని హస్తగతమైనా చేసుకోవాలని లేదా కొత్త పార్టీనైనా స్థాపిస్తేనే బాలయ్యకు ప్రజలు పట్టం గడతారని, బాబుతో ఉంటే నమ్మరని ఆమె పలుమార్లు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+