హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9లక్షల కుంకుమపువ్వు, 80లక్షల ఎర్రచందనం పట్టివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shamshabad Air Port
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. తొమ్మిది లక్షల విలువైన కుంకుమ పువ్వును కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. ఓ ప్రయాణీకుడు షార్జా నుండి హైదరబాద్‌కు అక్రమంగా కుంకుమపువ్వు తరలిస్తుండగా పోలీసులు దానిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం ఫ్లైట్‌లో దిగాడు. నిందితుడి బ్యాగేజ్‌పై అనుమానం వచ్చిన పోలీసులు అతనిని ప్రశ్నించారు. నిందితుడు ఇప్పుడు కస్టమ్స్ అధికారుల అదుపులో ఉన్నాడు. కాగా కుంకుమపువ్వు చాలా అరుదుగా దొరికే వస్తువు కావడంతో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. కుంకుమపువ్వు క్రోకస్ సేటివస్ అనే పుష్పం నుండి వస్తుంది. దీనిని సాధారణంగా సాఫ్రాన్ క్రోకస్ అంటారు. ఇది మధ్య ఆసియాలో దొరుకుతుంది.

మరోవైపు కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రెండు లారీలను సీజ్ చేసి, పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.80 లక్షలు ఉండవచ్చునని సమాచారం.

English summary
Vigilant airport authorities got hold of a major haul of Saffron that arrived in the early hours of the day in the Shamshabad airport, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X