విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరువర్గం మంత్రికి నిజమే: భవానీపై పెదవి విప్పిన వట్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
విజయవాడ: భవానీ ద్వీపంపై మంత్రి వట్టి వసంత కుమార్ శుక్రవారం మొదటిసారి నోరు మెదిపారు. భవానీ ద్వీపాన్ని మంత్రి గంటా శ్రీనివాస రావుకు కేటాయించిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. రూ.289 కోట్లకు గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీకి అప్పగించామని చెప్పారు. భవానీకి ప్రత్యూష షిప్పింగ్ కంపెనీ కోట్ చేసిందని చెప్పారు. అందుకే అప్పగించామని అన్నారు. ఈ ద్వీపానికి గంటా దాఖలు చేసే నాటికి తాను ఈ శాఖ మంత్రిగా లేనని ఆయన వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీకి తగదని ఆయన సూచించారు. వట్టి వసంత్ కుమార్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింప జేస్తామని అన్నారు. భవానీ ద్వీపం ఓ వ్యక్తికి కట్టబెట్టడానికి వారెవరని అన్నారు.

కాగా చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన భవానీ ద్వీపం ఐలాండ్ పర్యాటక ప్రాజెక్టును అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బహిరంగ టెండర్ల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ అది శ్రీనివాస రావు కంపెనీ చేతి నుంచి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భవానీ ఐలాండ్‌తో పాటు ఇతర పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేయడానికి ఏడాది క్రితమే పిలిచారు. కానీ వాటిని ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ఖరారు చేశారు.

English summary
Minister Vatti Vasanth Kumar opened his mouth about Bhavani island today in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X