హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఐఎఎస్ అధికారులు చెబుతున్న మాటలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. తాము తిన్నది తక్కువేనని, పెద్ద తిమింగిలాలను పట్టుకోవాలని ఐఎఎస్ అధికారులు అంటున్నారని గుర్తు చేస్తూ దీనికి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన కొంపల్లిలో జరిగిన యువజన సదస్సులో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తుంటే కుంభకోణాలు, హత్యలే గుర్తుకొస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయలు దిగమింగి లక్ష విగ్రహాలు స్థాపిస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు రెడ్ కార్పెట్ పరిచారని, తమపైకి రాళ్లు విసిరారని ఆయన అన్నారు. పోలవరం టెండర్ల రద్దు తమ విజయమేనని ఆయన అన్నారు. తాము చేసిన ఆరోపణల వల్లనే పోలవరం టెండర్లను ముఖ్యమంత్రి రద్దు చేశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు వ్యవహడరిస్తున్నారని ఆయన అన్నారు. బాంబులకే భయపడలేదు, ప్రాణాలను లెక్క చేయలేదని, వీరి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ రోజు తమ వేదిక మీంచి మాట్లాడి ఉండేవారని ఆయన అన్నారు.

కుటుంబ సభ్యుల కన్నా తనకు పార్టీ కార్యకర్తలే ముఖ్యమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందని, దీనిపై తాము కాంగ్రెసుతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో చెప్పాలని ఆయన అడిగారు. యువతకు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తమ పార్టీ గెలిస్తేనే రాష్ట్రాన్ని కాపాడగలుగుతామని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu asked YSR Congress president YS Jagan to reply to IAS officers comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X