జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం, 9 మంది మృతి

జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రోగులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. స్టయిఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం కూడా జూడాలను చర్చలకు పిలిచింది. అయితే, ప్రభుత్వం దిగి రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. వైద్య విద్య శాఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిఎల్ రవీంద్రా రెడ్డి నుంచి తప్పించి కొత్త మంత్రి కొండ్రు మురళికి అప్పగించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు భయపడేది లేదని కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల డిమాండ్ల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించడానికి సిద్ధంగా లేదు.
జూనియర్ డాక్టర్లు విద్యార్థులు మాత్రమేనని గుర్తించుకోవాలని మంత్రి మురళి అన్నారు. తాము సీనియర్ డాక్టర్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ డాక్టర్లు పట్టుదలకు పోవడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications