ఎమ్మార్ కేసు: సునీల్ రెడ్డి ఖాతాలోకి రూ.96 కోట్లు?

సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ తమ వద్ద ఉందంటూ ఆ టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం వివరాలు ఇలా ఉన్నాయి - కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు ఖాతాలో కోటి రూపాయలు జమయ్యాయి. కోనేరు మధు దుబాయ్‌లో ఉంటున్నాడు. అధికారులు, కంపెనీలు కుట్ర చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులను కొల్లగొట్టారు. విల్లాల విక్రయాల ద్వారా స్టైలిష్ హోమ్స్ 167 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 96 కోట్లు అక్రమ వసూళ్లు. బిపి ఆచార్య తన మిత్రుడు త్రిపాఠీ పేరు మీద విల్లా స్థలం కొన్నాడు.
విల్లా కోసం ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెవి రావు పేరు మీద ఓ విల్లా ఉంది. పారిశ్రామికవేత్తల పేరు మీద విజయ రాఘవ విల్లాలు కొనుగోలు చేశాడు. ప్రభుత్వ వాటా తగ్గడానికి బిపి ఆచార్య కుట్ర చేశారని సిబిఐ అభియోగం మోపింది.












Click it and Unblock the Notifications