భవానీ చిరంజీవి దీవి: దేవినేని ఉమామహేశ్వ రావు

దేవినేని ఉమామహేశ్వర రావు నాయకత్వంలో తెలుగుదేశం, సిపిఎం నాయకులు భవానీ దీవిని సందర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాలకు పర్యాటక సౌందర్యాన్ని చౌకగా అందించేందుకు ఎన్టీఆర్ ఈ దీవిని అభివృద్ధి చేశారని రాజకీయ నాయకులు గుర్తు చేశారు. సిపిఐ, తెలుగుదేశం నాయకులు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కనకదుర్గమ్మ సాక్షిగా భవానీ దీవిని కాంగ్రెసు నాయకులు చిరంజీవికి బినామీగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు కట్టబెట్టారని దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.












Click it and Unblock the Notifications