తల పగులగొడ్తామని రత్నకిశోర్ అన్నారు: జూడాలు

జూనియర్ డాక్టర్ల సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమ్మె చట్టవిరుద్ధమంటూ రాజు అనే న్యాయవాది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. వైద్య విద్యాశాఖకు, వైద్య విద్యార్థులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసును రేపటికి వాయిదా వేసింది. జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలను కూడా బహిష్కరించడం వల్ల రోగులు మృత్యువాత పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, వైద్య సేవలు అందక మరణించినవారెవరూ లేరని ప్రభుత్వం వాదిస్తోంది.












Click it and Unblock the Notifications