చంద్రబాబుపై జగనే కేసు వేయించారు: రేవంత్ రెడ్డి

చంద్రబాబుపై బురద చల్లాలని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని, కొన్ని మీడియా సంస్థలు సమాచారం సరిగా లేక తప్పుడు వార్తలు ఇచ్చాయని ఆయన అన్నారు. చంద్రబాబుపై చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసునని, అందుకే ఇతరుల చేత ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎమ్మార్ వ్యవహారంలో తప్పులు జరగలేదని సిబిఐ చార్జిషీట్‌లో స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై ఆరోపణలతో వార్తాకథనాలు రాస్తే మీడియాకు ఆయాసమే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్రమాలు జరిగాయని, సిబిఐ దర్యాప్తు ప్రభుత్వ నిర్ణయాల మీద జరగడం లేదని, అవినీతి సొమ్ము ఎవరికి చేరిందనే విషయంపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications