ప్రధాని నివాసం ఇంటికి అతి సమీపంలో పేలుడు

పేలుడు గల కారణమేమిటనేది తెలియడం లేదు. పేలుడు సంభవించిన కారు ఎంబసీ కార్యలయానికి సమీపంలో ఉందని ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి డేవిడ్ గోల్డ్‌ఫార్బ్ చెప్పారు. పేలుడు సోమవారం సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు సంభవించింది. గాయపడినవారిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిన ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగిని మాత్రం ఎయిమ్స్‌లో చేర్చారు.
ఢిల్లీలోని తమ ఎంబసీ కార్యాలయం వద్ద పేలుడు ఉగ్రవాద చర్యేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ రాయవార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డారని అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ రాయబారి కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి దాడులను సహించబోమని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. పేలుడు సంఘటనపై కేంద్ర హోం శాఖ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications