టెర్రర్ టార్గెట్ ఇజ్రాయెల్ రాయబారి భార్య: చిదంబరం

సుశిక్షితుడైన వ్యక్తే కారుకు బాంబును అమర్చాడని ఆయన అన్నారు. బాంబు పెట్టిన వ్యక్తి వెళ్లిపోయిన నాలుగైదు సెకన్లకే పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు. సిసిటివి కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించామని, మోటార్ సైకిల్‌కు సంబందించిన స్పష్టమైన చిత్రం లభించడం లేదని, నెంబర్ ప్లేటు కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు. మోటార్ సైక్లిస్టును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణతో పాటు తామంతా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు.
పేలుడులో గాయపడిన ఇజ్రాయెల్ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడిందని ఆయన చెప్పారు. పేలుడులో గాయపడిన ఇతర వ్యక్తుల పరిస్థితి కూడా బాగానే ఉందని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసు కమిషనర్ సాయంత్రం ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications