హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభ వాయిదా, స్పీకర్‌ను కలిసిన జగన్‌ వర్గం ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శాసనసభ వాయిదా పర్వాలు కొనసాగుతున్నాయి. బుధవారం సమావేశాలు ప్రారంభమైన పది నిమిషాలకే అసెంబ్లీ అరగంట పాటు వాయిదా పడింది. మద్యం సిండికేట్‌లలోని మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు పోడియం వైపు దూసుకు పోయారు. పోడియాన్ని చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిండికేట్లతో సంబంధమున్న మంత్రులను తొలగించాలని పట్టుపట్టారు. టిఆర్ఎస్, తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం స్పీకర్ శాసనసభా పక్ష నేతలను తన ఛాంబర్‌కు పిలిపించారు. సభా నిర్వహణపై చర్చించారు. కాగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ మద్యం సిండికేట్లపై, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణపై, సిపిఐ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై, సిపిఎం కరవు సహాయంపై వాయిదా తీర్మానం ఇచ్చాయి. స్పీకర్ ఆ తీర్మానాలన్నింటిని తిరస్కరించారు.

సభ ప్రారంభానికి ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రతిపక్షం స్పందించాలన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు.

English summary
Assembly adjourned for half an hour today. Jagan camp MLA Kapu Ramachandra Reddy met speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X