హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ లక్ష్యంపై ఎంపి ఉండవల్లి కొత్త వాదన

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంపై కొత్త వాదన ముందుకు తెచ్చారు. వైయస్ జగన్ లక్ష్యం కాంగ్రెసు పార్టీయేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించి, కాంగ్రెసు పార్టీని పాతాళంలోకి తొక్కడమే జగన్ లక్ష్యమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్ని పార్టీలో పోయాయని ఆయన అన్నారు.

పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో బుధవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నేతలు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. పోలవరం, నర్సాపురం సీట్లలో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహరచనకు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. 1989లో కొత్త పార్టీ పెట్టాలని వైయస్ రాజశేఖర రెడ్డికి సూచించారని, అందుకు వైయస్సార్ నిరాకరించారని మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పారు. జగన్ ధాటికి ఏమైపోతామోననే భయం కాంగ్రెసు కార్యకర్తల్లో ఉందని మరో మంత్రి పితాని అన్నారు.

English summary
Congress MP Undavalli Arunkumar said that YSR Congress president YS jagan target is Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X